ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్‌కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
అందుబాటులోకి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు...!
Updated on: 2025-06-12 07:52:00
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET 2025)కు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం సాయంత్రం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు జర్నల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నిర్ణీత తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సెషన్- 1; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 18, 19, 24 (మొదటి షిఫ్టు), 28, 29, 30 తేదీల్లో పేపర్ -2 పరీక్షలు జరగనుండగా.. జూన్ 20, 23, 24 (రెండో షిఫ్టు), 27 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 15 నుంచి 30 తేదీ వరకు టెట్‌కు దరఖాస్తులు ఆహ్వానించగా 1.83లక్షల దరఖాస్తులు వచ్చాయి. పేపర్ 1కు 63,261మంది, పేపర్-2కు 1,20,392మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.