ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్‌కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. ఐపీఎస్ ఆంజనేయులుకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ
Updated on: 2025-06-10 09:33:00
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్‌కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. వీరిద్దరూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కేసు తీవ్రత, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు (ఏ1), మధుసూదన్ (ఏ2) ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తొలుత ట్రయల్ కోర్టు వీరి బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులపై ఉన్న ఆరోపణల తీవ్రత, నేరం రుజువైతే పడే శిక్ష, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం వంటి అంశాలను బెయిల్ మంజూరు చేసే సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, పిటిషనర్లపై ఉన్న నేర స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.