ముఖ్య సమాచారం
-
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అమరావతి ప్రాంత మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి జర్నలిస్టు లపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు వినతి
Updated on: 2025-06-08 21:04:00

అమరావతి రాజధాని, ప్రాంత మహిళల పై జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన మైలవరం నియోజకవర్గ కూటమి మహిళా నేతలు.
ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు తెలుగు మహిళ కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ: ప్రజలు ఎన్నికల్లో బుధ్ధి చెప్పినా ఇంకా సిగ్గు లేకుండా జగన్ & సైకో బ్యాచ్ రాజధాని అమరావతి పై విషం చిమ్ముతున్నారు వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యలు కేవలం అమరావతి రాజధాని మహిళలను మాత్రమే కాదు రాష్ట్ర మహిళలు అందరినీ బాధిస్తున్నాయి రాజధానిపై సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్,కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్,కృష్ణంరాజు లో మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా కమీషన్ కు వినతి పత్రం అందజేశారు