ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
Updated on: 2025-04-29 07:20:00

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మే 2వ తేదీన రాజధాని అమరావతి పునః నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరగనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపు అవుతుందని, రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని సీఎం అన్నారు. రాజధాని రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు.
రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనులలో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రైతులతో సీఎం చర్చించారు. ల్యాండ్ పూలింగ్‌లో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.