ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
Updated on: 2025-04-29 07:02:00

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో తిరుమల కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకుంటారు. ఇక వేసవి సెలవుల(సమ్మర్ హాలిడేస్) నేపథ్యంలో తిరుమలలో భక్తులు(Devotees) అధిక సంఖ్యలో తరలి వస్తారు. భక్తజనంతో తిరుమల గిరులు కిక్కిరిసిపోతాయి. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో తిరుమల(tirumala) కొండపై ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో లాకర్లు మొదలుకొని, అద్దె గదుల వరకు అన్నీ ఫుల్ అయిపోతాయి. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు రూమ్స్ దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. తిరుమలలో రూములు దొరిక్క ఇక్కట్లు పడుతున్న వారి కోసం దేవస్థానం అవగాహన కల్పిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రకారం.. తిరుమల బస్టాండ్ సమీపంలో ఉన్న CRO కార్యాలయానికి సరైన (ఆధార్)ఐడీ కార్డు(ఆధార్ కార్డు)తో వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత మొబైల్‌కి కన్ఫర్మేషన్ SMS వస్తుంది. మొదట ఎవరు వస్తారో వారికి మాత్రమే రూమ్స్‌ను కేటాయిస్తారు. ఈ కార్యాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది.