ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ లకు నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
Updated on: 2025-04-25 19:36:00

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తికి ఢిల్లీ కోర్టులో తాత్కాలికంగా బ్రేక్ పడింది. సోనియా, రాహుల్ లకు నోటీసులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈడీ సమర్పించిన పత్రాల్లోని లోపాలను సరిదిద్దాలని, కేసుకు సంబంధించి మరింత నిర్ధారణతో కూడిన సరైన పత్రాలను అందించాలని న్యాయస్థానం దర్యాప్తు సంస్థను ఆదేశించింది. "పూర్తిగా సంతృప్తి చెందే వరకు నేను అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేను" అని న్యాయమూర్తి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ దశలో విచారణను ఆలస్యం చేయవద్దని, నోటీసులు జారీ చేయాలని ఈడీ తరపు న్యాయవాది కోరినప్పటికీ, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఈ మేరకు కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.