ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
టీ20ల్లో రోహిత్, బుమ్రా అరుదైన రికార్డులు
Updated on: 2025-04-24 07:38:00

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో అరుదైన రికార్డులు నమోదు చేశారు. బుధవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్ లో ఈ ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఆటగాళ్లు అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకున్నారు.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్‌ను ముంబయి ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఎంఐ విజయంలో ఆ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ టీ20 క్రికెట్లో 12వేల పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు.
విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డుకెక్కాడు. ఓవరాల్‌గా టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ఖాతాలో 12,056 టీ20 పరుగులు ఉన్నాయి.