ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కియా ఫ్యాక్టరీలో ఇంజిన్ల మిస్సింగ్ కేసు- ఊహించని విషయాలు వెలుగులోకి
Updated on: 2025-04-21 07:59:00

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న కియా ఫ్యాక్టరీలో కార్ల ఇంజిన్ల చోరీ కేసులో మిస్టరీ ఒక్కొక్కటిగా వీడుతోంది.కియా కార్లకు సంబంధించిన ఖరీదైన ఇంజిన్లను తీసుకెళ్లి మరీ దారుణంగా చేపల వేట బోట్లకు, చెరుకు రసం మిషన్ల వారికి అమ్మినట్లు తెలుస్తోంది. కియా ఫ్యాక్టరీలో కార్ల ఇంజిన్ల చోరీ కేసులో తమిళ నాడుకు చెందిన వినాయక మూర్తి, మణికంఠ, ఆర్ముగన్, పటాన్ సలీం, అర్జున్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పెనుకొండ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. వీరిలో కొందరు గతంలో కియా పరిశ్రమలో ఉద్యోగాలు చేసి మానేసినట్లు తెలుస్తోంది.కియా కంపెనీలో మూడేళ్లలో మొత్తం 900కి పైగా ఇంజిన్లు మాయంకాగా.. నిందితులు వీటిని తమిళనాడుకు తరలించి, అక్కడ ఒక వ్యాపారికి అమ్మారు. అతను వాటిని ఢిల్లీలోని ముగ్గురికి అమ్మినట్లు సమాచారం. పోలీసులు మరికొందరు నిందితులు కోసం గాలిస్తున్నట్లు.. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్నవారిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది.