ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
Updated on: 2025-04-16 18:02:00

న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్ పై నిషేధం విధిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆదేశించింది. ఈ సంస్థ సూచన మేరకు అనుమతి లేని మెడిసిన్ రకాలపై నిషేధం విధిస్తూ డీసీజీఐ లేఖ ద్వారా హెచ్చరించింది. అందులో పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ డ్రగ్స్, నరాలకు సంబంధించిన డ్రగ్స్, గర్భధారణ మెడిసిన్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లాంటివి ఆ 35 రకాల మెడిసిన్లలో ఉన్నాయని సంస్థ తెలిపిందని సమాచారం. ఆ మెడిసిన్ ఉత్పత్తి తక్షణమే నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపరాదని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
సరైన ప్రమాణాలు, సేఫ్టీ నిర్ధారణ లేని వాటిపై నిషేధం
కొన్ని మెడిసిన్లలో ఒకటి కంటే ఎక్కువ డ్రగ్ కాంబినేషన్ (FDC) ఉంటుంది. అలా ఒకే మెడిసిన్ ఒకటి కంటే ఎక్కువ రకాల సప్లిమెంట్ కలిపే మందులను "కాక్టెయిల్" మెడిసిన్ అని పిలుస్తారు. CDSCO సంస్థ సూచనలతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆమోదించని FDCల తయారీతో పాటు మార్కెటింగ్ నిలిపివేయాలని లేఖ రాసింది. ప్రజల ఆరోగ్యం, మెడిసిన్ సమర్థతపై సమీక్షలు నిర్వహించి అధికారులు గతంలో లైసెన్స్ ఇచ్చిన 35 ఆమోదించని కొన్ని FDC ల జాబితాను సిద్ధం చేసి ఆ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శాస్త్రీయ నిర్ధారణ లేని మెడిసిన్ పేషెంట్ల ప్రాణాల మీదకు తెస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సంస్థ పేర్కొంది.