ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
బాదుడే బాదుడు... 6.4 ఓవర్లలోనే 100 కొట్టిన సన్ రైజర్స్
Updated on: 2025-03-23 18:09:00

ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్ హెచ్ జట్టుకు అదరిపోయే ఆరంభం లభించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ తొలి వికెట్ కు కేవలం 3.1 ఓవర్లలోనే 45 పరుగులు జోడించి ఫ్లయింగ్ స్టార్ట్ అందించింది. 11 బంతుల్లో 5 ఫోర్లతో చకచకా 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ... స్పిన్నర్ మహీశ్ తీక్షణ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత హెడ్ కు మరో చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ తోడయ్యాడు. ఈ జోడీ రాజస్థాన్ బౌలింగ్ ను చీల్చిచెండాడంతో సన్ రైజర్స్ 6.4 ఓవర్లలోనే 101 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్ 1 ఓవర్ వేసి 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో ట్రావిస్ హెడ్ అవుటాఫ్ ద పార్క్ రేంజిలో కొట్టిన భారీ సిక్సర్ హైలైట్ గా నిలిచింది.