ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి..బొబ్బిలి మాజీ సైనిక సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్
Updated on: 2025-03-21 05:51:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామినాయుడు ఆధ్వర్యంలో గురువారం సభ్యులంతా కలిసి తాసిల్దార్ ఎం శ్రీనును తమ కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు బొబ్బిలి మాజీ సైనికుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించవలసిందిగా జిల్లా సైనిక అధికారి ఎం కృష్ణారావు ఇచ్చిన పత్రాన్ని అందజేశారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పూర్తి జీవితాన్ని సరిహద్దుల్లో గడిపి, విధులు నిర్వర్తించి రిటైర్ అయిన మాజీ సైనికులను ప్రోత్సహించాలని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు వ్రాసి ఇచ్చిన డేమీ అఫీషియల్ లెటర్ ను తాసిల్దార్ కు ఇచ్చారు. దీనికి తాసిల్దార్ స్పందించి తక్షణమే ప్రభుత్వ భూమిని గుర్తించి త్వరలో మీ అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్, కార్యదర్శి గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్ర మోహన్, సిహెచ్ డేవిడ్ తదితర మాజీ సైనికులు పాల్గొన్నారు.