ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20.. సెమీస్‌లో ఆసీస్‌పై భారత్ ఘన విజయం
Updated on: 2025-03-14 07:07:00

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 సెమీఫైనల్ల్లో ఆస్ట్రేలియా మాస్టర్స్‌పై ఇండియా మాస్టర్స్ ఘన విజయం సాధించింది. 94 రన్స్ తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువరాజ్ సింగ్ 30 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 సిక్సర్లు, ఒక ఫోర్ నమోదు కావడం విశేషం. యువీ తోడుగా కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (42), స్టువర్ట్ బిన్నీ (36) కూడా బ్యాటింగ్‌లో అదరగొట్టారు. ఇక 221 పరుగుల భారీ లక్ష్యచేధనలో కంగారూలు 126 రన్స్‌కే పరిమితయ్యారు. దీంతో ఇండియా మాస్టర్స్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు నదీమ్ 4 వికెట్లు పడగొట్టగా... ఇర్ఫాన్ పఠాన్, వినయ్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు.