ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
చరిత్ర సృష్టించిన టీమిండియా..
Updated on: 2025-03-09 21:53:00

టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (83 బంతుల్లో 76) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఛేజింగ్‌ను సులభం చేశాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29), కేఎల్ రాహుల్ (34) రాణించడంతో టీమిండియా టార్గెట్‌ను ఛేదించింది.252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ (31)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 105 పరుగులు జోడించాడు. టీమిండియా విజయం లాంఛనమే అనుకున్న దశలో శాంట్నర్ తొలి బ్రేక్ ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్ అవుటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ (1)ని బ్రేస్‌వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రోహిత్.. రచిన్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత అయ్యర్, శ్రేయస్ మరోసారి చక్కటి సమన్వయంతో భాగస్వామ్యం నెలకొల్పారు. 60 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా (18) అవుటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (34) లాంఛనాన్ని పూర్తి చేశాడు