ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
భారతదేశ సమైక్యత, సౌభ్రాతృత్వానికి నేటితో 76 ఏళ్ళు - ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Updated on: 2025-01-26 13:35:00

గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయం & జ్యోతిర్మయి అపార్ట్మెంట్స్ లో జాతియజెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
భారతదేశ సమైక్యత, సౌభ్రాతృత్వానికి నేటితో 76 ఏళ్ళు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొనియాడారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనివాసరావు పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో మరియు జ్యోతిర్మయి అపార్ట్మెంట్స్ లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించి నేటికి 75 ఏళ్లు పూర్తై 76వ ఏటలో అడుగుపెడుతున్నామని,సమైక్యత, సౌభ్రాతృత్వం గల అతిపెద్ద ప్రజాస్వామ్యం, భారతీయ రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్ళు అవుతోందని దీని వెనుక ఎంతోమంది మహానుభావుల త్యాగఫలం ఉన్నదని, వారి త్యాగాలను మనం మరవకూడదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. స్వేచ్ఛాయుత భారతదేశంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ భాద్యత తీసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.