ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పవన్ 'వారాహి' యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం:బాలకృష్ణ
Updated on: 2023-09-30 17:00:00

నంద్యాల:జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన 'వారాహి'యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, తెదేపా నేత నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.ఈ భేటీ అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు.సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు.ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు.ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారు అని బాలకృష్ణ ఆరోపించారు.ఈ సమావేశంలో ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యే బాలకృష్ణ,యనమల.రామకృష్ణుడు,నక్కా.ఆనంద్‌బాబు,అశోక్ బాబు,బీద.రవిచంద్ర,నిమ్మల రామానాయుడు,బీసీ జనార్దన్ రెడ్డి,వంగలపూడి.అనిత తదితరులు పాల్గొన్నారు.