ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఎమ్మెల్యే బేబీ నాయనకు ధన్యవాదాలు తెలిపిన బొబ్బిలి మాజీ సైనికులు
Updated on: 2026-02-14 14:57:00
2019 లో పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి లో 40 మంది జవాన్లు ఇదే రోజు వీర మరణం పొందారు. దానికి సంతాపంగా శనివారం బ్లాక్ డే పాటిస్తూ బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు పాత కోటలో సంఘము కార్యాలయ ఆవరణలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ మన సంఘం తరపు నుండి అసెంబ్లీలో మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రస్తావించ వలసిందిగా ఎమ్మెల్యే బేబీ నాయనని ఆదివారం 8వ తేదీన కోరిన తరుణంలో ఆయన 11న అసెంబ్లీ మొదలవుగా 13వ తేదీనే.. 2 రోజులలోనే అసెంబ్లీలో మన సమస్యను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు మన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సంఘం సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేసిందన్నారు. దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ సైనికులకు ప్రభుత్వం తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలని వారికి కనీసం 4 నుండి 5 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాలకే కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు, సభ్యులు పాల్గొన్నారు.