ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
Updated on: 2026-02-08 10:33:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ ఆధ్వర్యంలో సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బేబీనాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా మాజీ సైనికులకు ప్రభుత్వ నుంచి జీవో ప్రకారం743/63 ప్రకారం.. 5 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది.... కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేనందున మానవతా దృక్పథంతో వారికి కనీసము 175 గజాల ఇళ్ల స్థలానైనా కేటాయించవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందించారు . అలాగే ఈ సమస్యను రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించవలసిందిగా కోరారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి క్వచ్చన్ అవర్లో సమయం దొరకకపోవచ్చు ..అయినప్పటికీ జీరో అవర్స్ లో మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మరడరామినాయుడు సభ్యులు భోగి ఈశ్వరరావు పి నాగేశ్వరరావు పి అప్పలనాయుడు ఎం లక్ష్మణరావు సిహెచ్ మోహన్ రావు ఎస్వీ రమణమూర్తి సిహెచ్ త్రివేది ఎం శ్రీనివాసరావు గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్వీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.