ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?
Updated on: 2026-01-22 09:39:00
నేటి కాలంలో షుగర్ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ తప్పనిసరి. ముఖ్యంగా మాంసాహారం తినే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది..
చికెన్ తింటే మంచిదా? లేక మటన్ తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్....
మటన్ అనేది రెడ్ మీట్ కేటగిరీకి చెందుతుంది. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. మటన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మటన్‌ను పూర్తిగా మానేయాల్సిన పనిలేదు కానీ చాలా మితంగా తీసుకోవడం ఉత్తమం.
చికెన్....
మటన్‌తో పోలిస్తే చికెన్ షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు. చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. చికెన్ తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా ఇతర కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా నియంత్రిస్తుంది.
వండే పద్ధతిలోనే అసలు రహస్యం ఉంది
చికెన్ మంచిదే కదా అని చికెన్ ఫ్రైలు, మసాలా దట్టించిన కర్రీలు తింటే ఫలితం రివర్స్ అవుతుంది. నూనెలో బాగా వేయించిన చికెన్, నెయ్యి లేదా క్రీమ్ కలిపిన గ్రేవీలు అస్సలు మంచివి కావు. ఉడికించిన చికెన్, గ్రిల్డ్ చికెన్ లేదా తక్కువ నూనెతో వండిన కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్కిన్లెస్ చికెన్ ఇంకా మంచిది.
మొత్తం మీద చూస్తే, డయాబెటిస్ ఉన్నవారికి మటన్ కంటే చికెన్ సురక్షితమైన ఎంపిక. అయితే ఏ మాంసాహారమైనా పరిమితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఆహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.