ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
గేట్ ప్రవేశ పరీక్ష తేదీలు ఎప్పుడంటే ?
Updated on: 2025-10-21 11:06:00
దేశవ్యాప్తంగా ఎంటెక్, పీహెచ్‌డీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2026 పరీక్ష తేదీలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ 2026 ప్రవేశ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ గువాహటి వెబ్‌సైట్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. మొత్తం 30 పేపర్లలో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీటెక్‌తోపాటు బీఎస్సీ, బీఏ, బీకాం విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. పరీక్షలో సాధించిన స్కోర్‌కు ఫలితం వెలువడినప్పటి నుంచి వరుసగా మూడేళ్లపాటు గేట్ స్కోర్‌కు విలువ ఉంటుంది. ఆ స్కోర్‌తో మూడేళ్లలో ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. అభ్యర్ధులు గరిష్ఠంగా 2 పేపర్ల వరకు పరీక్ష రాయవచ్చు.