ముఖ్య సమాచారం
-
ఏఐ సబ్జెక్టుతో ఏకంగా 50 కోర్సులు తీసుకువచ్చిన ఛండీగఢ్ యూనివర్సిటీ
-
భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు లైసెన్స్!
-
ఫిజియోథెరపీ పేరుతో ఇంట్లోకి చొరబడి... హైదరాబాద్ లో వృద్ధ దంపతుల దారుణ హత్య
-
న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ
-
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారు దగ్ధం... వీడియో ఇదిగో!
-
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్
-
జమ్మూ కశ్మీర్లో వరల్డ్ వండర్ ఆవిష్కృతం..
-
మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్‌కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
Updated on: 2025-06-06 09:08:00

సాధారణంగా ఎవరి చిరునామాకైనా పిన్‌కోడ్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ, ఈ పిన్కోడ్లు పెద్దపెద్ద ప్రాంతాలను మాత్రమే సూచిస్తాయి. ఉదాహరణకు, ఒకే పిన్ కోడ్‌కి పలు వీధులు, వేలాది ఇల్లు, వ్యాపార స్థలాలు కూడా ఉండవచ్చు. అంటే, ఒక వ్యక్తి లేదా కుటుంబం నివసించే ఖచ్చితమైన స్థలాన్ని పిన్ కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టం. అలాగే, గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు వంటి చోట్ల ఎలాంటి ఫిజికల్ చిరునామా లేకపోవచ్చు కూడా. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం డిజిటల్ యుగానికి (Digital era) తగ్గట్లు ఓ వినూత్న ఆవిష్కరణను తీసుకువచ్చింది. ప్రతి ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు డిజిపిన్ (DIGIPIN) అనే డిజిటల్ చిరునామా వ్యవస్థను ప్రారంభించింది. ఇది సంప్రదాయ పిన్ కోడ్‌కు బదులుగా, ప్రతి ఇంటికీ ప్రత్యేకమైన 10 అక్షరాల డిజిటల్ అడ్రస్‌ను అందిస్తుంది. ఈ డిజిపిన్ వ్యవస్థ ద్వారా చిరునామాలు స్పష్టంగా లేకపోయినా, ఎక్కడ ఉన్నా సరే గ్రామమైనా, అడవుల మధ్య ఉన్న ప్రదేశమైనా ఖచ్చితమైన గుర్తింపు సాధ్యమవుతుంది. ఇది మన దేశపు డిజిటల్ అడ్రస్సింగ్ విధానంలో ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పవచ్చు.
డిజిపిన్ అంటే ఏమిటి?
డిజిపిన్ అనేది ఇండియన్ పోస్టు ఆఫీసు, ఐఐటీ హైదరాబాద్, ISROలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ జియోకోడ్ అడ్రస్ వ్యవస్థ. దీని ప్రకారం, దేశం మొత్తంను సుమారు 4 మీటర్ల × 4 మీటర్ల పరిమితి గల చిన్న చిన్న గ్రిడ్లుగా విభజించి, ప్రతి గ్రిడ్‌కు ప్రత్యేకమైన 10 అక్షరాల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్‌ను కేటాయిస్తారు. ఈ కోడ్ GPS లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధారంగా రూపొందించబడుతుంది. దీనివల్ల మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మీ ఖచ్చితమైన స్థలాన్ని డిజిపిన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు.