ముఖ్య సమాచారం
-
ఏఐ సబ్జెక్టుతో ఏకంగా 50 కోర్సులు తీసుకువచ్చిన ఛండీగఢ్ యూనివర్సిటీ
-
భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు లైసెన్స్!
-
ఫిజియోథెరపీ పేరుతో ఇంట్లోకి చొరబడి... హైదరాబాద్ లో వృద్ధ దంపతుల దారుణ హత్య
-
న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ
-
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారు దగ్ధం... వీడియో ఇదిగో!
-
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్
-
జమ్మూ కశ్మీర్లో వరల్డ్ వండర్ ఆవిష్కృతం..
-
మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్‌కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!
Updated on: 2025-06-05 17:53:00

జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. వైద్యు బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు