ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవముల్లో ఎమ్మెల్యే గళ్ళ మాధవి
Updated on: 2025-02-12 22:41:00

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్ మిర్చి యార్డు వద్ద, 44వ డివిజన్ కొరిటేపాడు వాకింగ్ ట్రాక్ వద్ద గల శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవముల్లో ఎమ్మెల్యే గళ్ళ మాధవి పాల్గొని స్వామివారు,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళ మాధవికి ఘన స్వాగతం పలికి,అర్చకులు ఎమ్మెల్యే మాధవికి వేద ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ... స్వామివారు, అమ్మవార్ల కల్యాణ మహోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని, ఆ స్వామి వారు, అమ్మవార్ల కృప మన అందరి పై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలం వెంకటేశ్వర్లు,కదిరి సంజయ్,కన్నసాని బాజి,రాజా, యర్రాకుల శ్రీనివాస్,పవన్ వెంకీ, చెంబెటి మణి కుమారి, తుమ్మల నాగేశ్వరరావు, చంద్రగిరి బాబు తదితరులు పాల్గొన్నారు