ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
మద్దిపాడు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వీఆర్వో కి తెలియకుండా ఫైల్ పంపిణీ ఫైలు
Updated on: 2024-07-05 06:26:00

వీఆర్వో తాసిల్దార్ కు తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి ఆర్డీవో ఆఫీసుకు ఫైలు కన్వర్షన్ కోసం పంపారు అంతా తానై సంతకాలు చేశారు రెండు లక్షల రూపాయలు మేరకు చేతులు మారిన వైనం మద్దిపాడు జులై 5 ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు గ్రామానికి చెందిన 30- 1F2 సర్వేనెంబర్ చెందిన రైతు నల్లూరి పద్మారావు భూమి కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి నిబంధనలకు విరుద్ధంగా స్థానిక వీఆర్వో మౌనిక కు మద్దిపాడు తాసిల్దార్ అనురాధకు తెలియకుండా డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి రెవిన్యూ నిబంధనలకు విరుద్ధంగా అంతా తానై ఫైల్ పై వీఆర్వో నివేదికను ఆర్ఐ నివేదికను తాసిల్దార్ సంతకాన్ని కూడా ఆ ఫైల్ పై పెట్టి ఒంగోలు ఆర్డీవో ఆఫీస్ కు ఫైల్ ను పంపారు దీనిపై ఒంగోలు ఆర్డీవో ఒక ఫైల్ ను సంతకాలు పెట్టారు మరొక ఫైల్ ను నిబంధనలకు విరుద్ధంగా ఉందని మద్దిపాడు తాసిల్దార్ కార్యాలయానికి ఫైల్లు పంపారు. ఆ ఫైల్ పై ఒంగోలు ఆర్డీవోకు అనుమానం వచ్చింది. తాసిల్దార్ కార్యాలయంలో ఆ ఫైల్ కు సంబంధించిన ఎలాంటి నివేదిక కూడా లేదు. ఒంగోలు ఆర్డీవో తాసిల్దార్ అనురాధను కన్వర్షన్ ఫైల్ గురించి అడగడంతో ఈ వ్యవహారం అంతా బట్టబయలైంది. తాసిల్దార్ అనురాధ ఏడు గుండ్ల పాడు వీఆర్వోను మౌనికను ఈ ఫైల్ గురించి అడగటంతో ఆ ఫైల్ గురించి నాకు ఏమి తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి ని ఫైల్ గురించి అడగడంతో ఆమె పొంతనలేని సమాధానాలు చెప్తూ నిర్లక్ష్యం దూరంతో వ్యవహరించటంతో తాసిల్దార్ కార్యాలయంలో కన్వర్షన్ వ్యవహారంపై తాసిల్దార్ అనురాధ డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి కార్యాలయంలో వాగ్గివాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ఒంగోలు ఆర్డీవో సమగ్ర నివేదికను ఇవ్వాలని తాసిల్దార్ని ఆదేశించారు. దీంతో కన్వర్షన్ ఫైలు చూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. మద్దిపాడు తాసిల్దార్ అనురాధ గత నెల 20, 21, తేదీ వ్యక్తిగత పనులపై తాసిల్దార్ నెల్లూరు వెళ్లారు. ఇదే అదునుగా చూసుకొని కన్వర్షన్ ఫైల్ తో పాటు మరో కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు సైతం వేరే వారికి బదలాయించినట్లు తెలియ వచ్చింది. దీంతో ఈ వ్యవహారం బయటపడటంతో మద్దిపాడు తాసిల్దార్ అనురాధ అవాక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి వ్యవహారం నా 40 సంవత్సరాల సర్వీస్ లో జరగలేదని డబ్బులు కోసం ఇంత దారుణానికి వడి కట్టడం సరైన పద్ధతి కాదని తాసిల్దార్ అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగుండ్ల లపాడు కన్వర్షన్ ఫైల్ లో రెండు లక్షల పైన చేతులు మారినట్టు తెలుస్తుంది. డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి మద్దిపాడు తాసిల్దార్ కార్యాలయాన్ని ఫైల్లును బ్రష్టు పట్టించారని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవిన్యూ నిబంధనలకే విరుద్ధంగా వ్యవహరించటం మద్దిపాడు మండలంలో ఇదే మొదటిసారి అని రెవిన్యూ ఉద్యోగులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. నిబంధనలకే విరుద్ధం మద్దిపాడు మండలం ఏడుగుండ్ల పాడు భూమికి సంబంధించిన కన్వర్షన్ వ్యవహారంతో డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. తాసిల్దార్ అనురాధ ఏమంటున్నారంటే క్షేత్రస్థాయిలో వీఆర్వో నివేదిక ఇవ్వాలి ఆ నివేదికను రెవిన్యూ ఇన్స్పెక్టర్ పరిశీలించి ఆమె నివేదిక ఇచ్చిన తరువాత డిప్యూటీ తాసిల్దార్ వద్దకు వెళ్తుంది ఆమె కౌంటర్ సైన్ పెట్టి తాసిల్దార్ లాగెన్ కి ఫైల్లు పంపించాలి ఇది రెవెన్యూలో నిబంధనల ప్రకారం జరగాలి, కానీ డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి అవి ఏమి పట్టించుకోకుండా రైతులు వద్ద డబ్బులు బేరం కుదుర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా అంతా తానై వ్యవహరించింది. దీనిపై మద్దిపాడు తాసిల్దార్ అనురాధ ఒంగోలు ఆర్డీవోకు జరిగిన వ్యవహారం మొత్తం సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. రెవిన్యూ ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం పరిశీలించి చర్యలు కు ఉపక్రమించవచ్చని రెవిన్యూ అధికారులు అంటున్నారు. డిప్యూటీ తాసిల్దార్ బరితెగింపు మద్దిపాడు తాసిల్దార్ కార్యాలయం డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం బరితెగింపుగా రెవిన్యూ వర్గాల ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వ్యవహారం పునరావతం కాకుండా డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి పై చర్యలు తీసుకోవాలని మద్దిపాడు మండలం రైతాంగం కోరుకుంటున్నారు. దీనిపై తాసిల్దార్ అనురాధ మాట్లాడుతూ తన కార్యాలయంలో తనకేమీ తెలియకుండా డిప్యూటీ తాసిల్దార్ ఆశాజ్యోతి ఈ వ్యవహారాన్ని వారం రోజులు పాటు గుట్టుగా ఉంచారు. ఒంగోలు ఆర్డీవో ఫైల్ వ్యవహారాన్ని అడగటంతో ఈ వ్యవహారం అంతా బట్టబయలైందని ఇలాంటి వారిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు మద్దిపాడు తాసిల్దార్ అనురాధ తెలిపారు.