ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పోలీస్ చాలన్ల వేధింపులు యాదగిరిగుట్ట వద్ద ట్రాఫిక్ చలాన్ల వేధింపులు మానుకోవాలి : VHP
Updated on: 2023-06-07 11:19:00

తెలంగాణలో అత్యంత పవిత్రమైన.. ప్రముఖమైన.. ప్రతిష్టాత్మకమైన దేవాలయం యాదగిరిగుట్ట. పెండింగ్ బిల్లుల పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదు ఫుట్ పాత్, రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేయాదగిరిగుట్ట వద్ద ట్రాఫిక్ చలాన్ల వేధింపులు మానుకోవాలి : VHP స్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి దేవాలయాల దగ్గర పోలీసుల వేధింపులకు పాల్పడితే విశ్వహిందూ పరిషత్ ప్రత్యక్షమవుతుంది. దేవాలయాల దగ్గర ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలతో పాటు గుట్టకు వెళ్లే రహదారిలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ.. పొల్యూషన్, పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిందేనని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. "నిరంతరం మేము రోడ్డుపైనే సంచరిస్తుంటాము.. మరో సందర్భంలో కడతాము" అని చెబుతున్నా భక్తులను పోలీసులు కదలనివ్వడం లేదు. దీంతో దేవాలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడి పోవాల్సిన పరిస్థితిని తీసుకువస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రాచకొండ కమిషనర్ పరిధిలో గల దేవాలయాల అన్నింటి దగ్గర ట్రాఫిక్ పోలీసుల వేధింపులు మానుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ శ్వేందర్ సింగ్ చౌహన్ ని విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు. తెలంగాణలో అత్యంత పవిత్రమైన.. ప్రముఖమైన.. ప్రతిష్టాత్మకమైన దేవాలయం యాదగిరిగుట్ట.! శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారు. కానీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వస్తున్న భక్తులపై చలాన్ల పేరుతో విరుచుకుపడటం ముమ్మాటికి హిందూ ద్రోహమేనని VHP నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేవాలయం దగ్గరైనా చలాన్ల పేరుతో వేధింపులకు గురి చేస్తే విశ్వహిందూ పరిషత్ ప్రత్యక్షమవుతుందని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరు పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా వాహనాలు నిలిపినా కూడా ఉద్దేశపూర్వకంగా ఫోటోలు తీస్తూ చలాన్ విధిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ చలాన్ ల పేరుతో భక్తులను వేధిస్తే తగిన రీతిలో జవాబు ఇస్తామని వారు హెచ్చరించారు. హిందూవేతరులు ఫుట్ పాతులతో మొదలుకొని ప్రధాన రోడ్డులను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న కూడా పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ట్రాఫిక్ ఇబ్బందులను గురిచేస్తున్న వారిని వెంబడి రోడ్లపై తొలగించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ను కలిసిన వారిలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్ , సహకార్యదర్శి శ్రీ భాను ప్రసాద్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ , బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివ రాములు , నాయకులు కిషోర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.