ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి..
Updated on: 2023-05-07 16:46:00
ఆరు మాసాలుగా నిధుల విడుదల నిలిపివేత పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం చెందారు.
కేంద్రం నిధులు ఇవ్వడం లేదనీ రాష్ట్రం.. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వడంలేదని కేంద్రం..ఒకరి పై ఒకరు ఆరోపణలు..చేసుకుని
సర్పంచుల హక్కులు కాల రాస్తున్నారు. దానివల్ల అప్పుల ఉబిలోకి సర్పంచులు కూరుకుపోయారు.
వచ్చిన నిధులను డిజిటల్ కీ తో సర్పంచులు తెలియకుండా డ్రా చేశారని, ఆ నిధులు
ఆత్మహత్యలు చేసుకొకముందే మాకు ఇవ్వండి అంటూ సర్పంచుల ఆవేదన చెందుతున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో జీవన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి,చలో ఎన్ ఆర్ ఐ సెల్ అధ్వర్యంలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల్లో హరితహారం వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు పల్లె ప్రకృతి వనాలు క్రీడా మైదానాలు పారిశుద్ధ్య నిర్వహణ తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులు, పాలక మండలి సభ్యులు విజయవంతంగా చేపడుతున్నారు.
రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచులకు ఆరు మాసాలుగా నిధులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలయ్యారు.ఒక్కొక్క సర్పంచ్ కు రు. 20 నుండి రు.50 లక్షల నిధులు రావాల్సి ఉన్నాయి.
బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సర్పంచులు బిల్లులు రాక బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.