ముఖ్య సమాచారం
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
-
సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే: చంద్రబాబు
-
ప్రకాశం జిల్లాలో లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం
-
ఈ సంక్షోభానికి ఇండిగోనే కారణం: సీఎం చంద్రబాబు
-
స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అక్కర్లేదు: ఏపీ ఆరోగ్యశాఖ
-
తెలంగాణలో చంపేస్తున్న చలి!
-
రూ.5 వేలు చెల్లిస్తే సైకిల్ దరఖాస్తు చేసుకోండి...
-
పవర్ లిఫ్టింగ్ లో ప్రతిభ చాటుతున్న నటి..!
-
కంటైనర్ ను ఆపింది ఏఎస్ఐ కుమారుడే!
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
Updated on: 2025-12-09 14:03:00
అమరావతి,వాజ్పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా ‘అటల్ సందేశ్... మోదీ సుపరిపాలన’ యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. ఈరోజు (మంగళవారం) ఎన్డీయే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చేపట్టే ‘అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన’ యాత్రలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్పేయి నాంది పలికారని... ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయని గుర్తుచేశారు. వాజ్ పేయి అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని అన్నారు.