ముఖ్య సమాచారం
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
-
సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే: చంద్రబాబు
-
ప్రకాశం జిల్లాలో లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం
-
ఈ సంక్షోభానికి ఇండిగోనే కారణం: సీఎం చంద్రబాబు
-
స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అక్కర్లేదు: ఏపీ ఆరోగ్యశాఖ
-
తెలంగాణలో చంపేస్తున్న చలి!
-
రూ.5 వేలు చెల్లిస్తే సైకిల్ దరఖాస్తు చేసుకోండి...
-
పవర్ లిఫ్టింగ్ లో ప్రతిభ చాటుతున్న నటి..!
-
కంటైనర్ ను ఆపింది ఏఎస్ఐ కుమారుడే!
తెలంగాణలో చంపేస్తున్న చలి!
Updated on: 2025-12-09 07:14:00
TG: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణను చలిపులి వణికిస్తుండటంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో సోమవారం అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని 17 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉండటం గమనార్హం. మెదక్ జిల్లా శివ్వంపేటలో 8.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్ నగరాన్ని సైతం చలి వదలడం లేదు. నగర శివారు ప్రాంతమైన శేరిలింగంపల్లిలో ఆదివారం రాత్రి 8.4 డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు