ముఖ్య సమాచారం
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
-
సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే: చంద్రబాబు
-
ప్రకాశం జిల్లాలో లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం
-
ఈ సంక్షోభానికి ఇండిగోనే కారణం: సీఎం చంద్రబాబు
-
స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అక్కర్లేదు: ఏపీ ఆరోగ్యశాఖ
-
తెలంగాణలో చంపేస్తున్న చలి!
-
రూ.5 వేలు చెల్లిస్తే సైకిల్ దరఖాస్తు చేసుకోండి...
-
పవర్ లిఫ్టింగ్ లో ప్రతిభ చాటుతున్న నటి..!
-
కంటైనర్ ను ఆపింది ఏఎస్ఐ కుమారుడే!
కంటైనర్ ను ఆపింది ఏఎస్ఐ కుమారుడే!
Updated on: 2025-12-08 13:01:00
చిలకలూరిపేట గ్రామీణ బైపాస్ లో ఈ నెల నాలుగున ఘోర ప్రమాదం. ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి చిక్కుముడి వీడింది,ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న భారీ కంటైనర్ ను ఓ కారులో వెళ్తున్న వ్యక్తి ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. కంటైనర్ ను ఆపిన వ్యక్తి నరసరావుపేట డిఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఏఎస్ఐ కుమారుడే అని గుర్తించారు.
ట్రాక్టర్ల లోడ్ కంటైనర్ ను పక్కన ఆపాలని కారులో నుంచి దిగి చేతితో సైగ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడింది. బ్రేక్ ఇన్స్పెక్టర్ గా అవతారం ఎత్తి జాతీయ రహదారులు బైపాస్ లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏఎస్ఐ కుమారుడి లీలలు బయటకు వస్తున్నాయి. 2023లో తక్కువ ధరకే బంగారం పేరిట కారు 40 లక్షలతో ఉడాయించాడు. ఇందులో తండ్రి హస్తం కూడా ఉందని అప్పట్లోనే నిర్ధారణ అయింది.
ప్రస్తుతం ఈ కేసు ఎస్పీ వద్ద ఉంది కుర్రాళ్లతో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు గంజాయి సరఫరా విక్రయాలు చేస్తూ కాలేజీ విద్యార్థులను మత్తులోకి దింపుతున్నాడు,వేరు,వేరు చోట్ల రిజిస్టర్ అయిన ఖరీదైన కార్లు ఇతను వద్ద ఐదు ఉన్నాయి. ఇవి ఎలా సంపాదించాడు ఎవరి పేరు రిజిస్టర్ అయి ఉన్నాయనేది పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.
పలుకుబడి ఉపయోగించుకొని కొన్నేళ్లుగా నరసరావుపేట లోనే పోస్టింగ్ వేయించుకుంటూ కుమారుడి నేరాలకు తండ్రి సహకరిస్తున్నట్లు పోలీస్ శాఖలోని చర్చ నడుస్తుంది. ఆదివారం చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు ఏఎస్ఐ కుమారుడిని నరసరావుపేట నుంచి తీసుకెళ్లి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.