ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్.. రిజర్వేషన్లపై జీవో విడుదల
Updated on: 2025-11-22 15:27:00
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ కీలకమైన జీవోను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ జీవోలో గిరిజన గ్రామాలకు సంబంధించి ఒక ప్రత్యేక నిబంధనను చేర్చింది. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయబడతాయని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పూర్తికావడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.