ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అనుమతి లేకుండా బీఈడీ, బీపీఈడీ ప్రవేశ పరీక్షలు రాసిన 30 మంది ఇన్-సర్వీస్ టీచర్ల దరఖాస్తుల తిరస్కరణ.
Updated on: 2025-11-19 17:09:00
అనుమతి లేకుండా ఇన్-సర్వీస్ టీచర్లు బీఈడీ, బీపీఈడీ ప్రవేశ పరీక్షలు రాశారని పేర్కొంటూ వారి ఉన్నత చదువుల దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ తిరస్కరించింది. అనంతపురం, కాకినాడ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, శ్రీసత్యసాయి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన టీచర్ల దరఖాస్తులు చేసుకోగా రిమార్కులతో డీఈవోలకు తిప్పిపంపింది. జీఓ-342 ప్రకారం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ఇన్-సర్వీసులో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రకారం కొంత మంది ఉపాధ్యాయులు ప్రవేశ పరీక్షలు రాశారు. కానీ డీఈవో అనుమతి లేకుండా ప్రవేశ పరీక్ష రాశారని రిమార్కుల్లో పేర్కొంటూ ఆయా జిల్లాలకు దరఖాస్తులను వెనక్కి పంపింది.