ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
భారీగా దిగొచ్చిన పసిడి...ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గిన బంగారం
Updated on: 2025-10-23 07:27:00
హైదరాబాద్: రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తాజాగా కాస్త దిగొస్తున్నాయి. హైదరాబాద్లో బుధవారం పసిడి ధర (Gold Rate) భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.9వేలకు పైగా తగ్గడం గమనార్హం. అటు వెండి ధర కూడా దిగొచ్చింది.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 గ్రాముల మేలిమి 10 గ్రాముల పుత్తడి (Gold) ధర రూ.1,25,250కి పడిపోయింది. 22 క్యారెట్ల ధర రూ.1,14,843గా ఉంది. ఇక వెండి ధర దాదాపు రూ.7వేలు తగ్గింది. నేడు కేజీ వెండి ధర రూ.1,58,000 పలుకుతోంది. వెండి ధర వారం రోజుల్లో దాదాపు రూ.28వేలు తగ్గింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4,022 డాలర్లకు పడిపోయింది. వెండి ధర 47.84 డాలర్లకు చేరింది.
ఇటీవల రికార్డు గరిష్ఠాలకు చేరిన బంగారం, వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.