ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
Updated on: 2025-10-16 10:42:00
దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ) నుంచి లభించిన బలమైన మద్దతు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదలైన వెంటనే సెన్సెక్స్ 340 పాయింట్లు (0.41 శాతం) పెరిగి 82,945 వద్దకు చేరుకుంది. అలాగే, నిఫ్టీ కూడా 105 పాయింట్లు (0.41 శాతం) లాభపడి 25,428 వద్ద ట్రేడ్ అవుతోంది.మార్కెట్లకు ముఖ్యంగా దేశీయ ఇన్వెస్టర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. నిన్న దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) ఏకంగా రూ. 4,650 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 68 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొన్నారు.