ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
గిరిజనులకు దుస్తులు పంపిణీ చేసిన బొబ్బిలి మాజీ సైనికులు
Updated on: 2025-09-25 22:11:00
బొబ్బిలి మండలంలో గల గిరిజన గ్రామాలైన చినమోసూరువలస , చిలకమ్మ వలస గ్రామాలలో గురువారం బొబ్బిలి మాజీ సైనిక సంఘం గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ పర్యవేక్షణలో గిరిజన గూడెంలో నివసిస్తున్న గిరిజనులను పలకరించి వారికి దుస్తులు, దుప్పట్లు, తువ్వాళ్లు, నిత్యావసరములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లు లేక గర్భిణీ మహిళలు డోలిపై వెళ్ళవలసి వస్తుందని, దుర్భరంగా బతుకుతున్నారని వీరికి సహాయపడటం మనందరి కర్తవ్యం అని తెలిపారు. మాజీ సైనికుడు మామిడి ధర్మారావు అక్కడ ఉన్న గర్భిణీ మహిళలకు తమవంతుగా చీర , కొంత ఆర్థిక సహాయం పోషక ఆహారము కోసం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు రెడ్డి రామకృష్ణ , ఎస్ఆర్ మోహన్ రావు, అలుగోలు గోవింద నాయుడు, వి ఎన్ శర్మ, గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్వీ రమణమూర్తి పాల్గొన్నారు.