ముఖ్య సమాచారం
-
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది..
-
బాడంగి మండలంలో పలువురు లబ్ధిదారులకు ఎం జీవిత భీమా పరిహార చెక్కు అందజేత
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి ఇక రెండున్నర గంటలే.. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
Updated on: 2025-09-11 09:35:00
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే అలైన్మెంట్ దాదాపు ఖరారు
నాలుగున్నర గంటల ప్రయాణం రెండున్నర గంటలకు తగ్గింపు
ప్రస్తుత మార్గం కంటే 57 కిలోమీటర్లు తగ్గనున్న దూరం.
తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, అమరావతి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య ముచ్చర్లలో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీకి సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ ఎక్స్ప్రెస్వే ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారికి కుడివైపుగా తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఇది సాగుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి సమీపంలో అమరావతికి చేరుకుంటుంది.
అక్కడి నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టు వరకు ఈ రహదారిని అనుసంధానిస్తారు. మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. దీని ప్రకారం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి దూరం 211 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ప్రస్తుత మార్గంతో పోలిస్తే 57 కిలోమీటర్లు తక్కువ.