ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అమరావతిలో ఐటీకి కొత్త జోష్.. 50 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్
Updated on: 2025-09-02 07:41:00
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబీఎం భాగస్వామ్యంతో 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ‘అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్’ (ఏక్యూసీసీ) ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఐబీఎం కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్లో 133 బిట్ సామర్థ్యమున్న సిస్టమ్తో పాటు, 5కే గేట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు ఐబీఎం ముందుకొచ్చింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలకు ఐబీఎం అంగీకారం తెలిపింది. దీని ప్రకారం, చదరపు అడుగుకు రూ. 30 చొప్పున చెల్లించడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నాలుగేళ్ల పాటు ఏటా 365 గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో రాజధానిలో సమాచార, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం లభించనుందని అధికారులు భావిస్తున్నారు.