ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
బొబ్బిలిలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Updated on: 2025-08-16 05:59:00
బొబ్బిలి ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని బొబ్బిలి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ సైనిక సంఘం గౌరవధ్యక్షులు మరడ రామినాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఘనంగా మాజీ సైనికుల కార్యాలయం ఆవరణలో పతాకావిష్కరణ చేసి మాజీ సైనికులు గౌరవ వందనం స్వీకరించారు.
మాజీ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాజీ సైనికులు ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు నిర్వహించడం గణనీయమని వారందరినీ అభినందించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలు రాళ్లను దాటుకొని భారత్ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. స్వాతంత్య్ర సమరయో ధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
అనంతరం మాజీ సైనిక సంక్షేమ అధ్యక్షుడు రేవుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలిపారు.అలాగే ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో మాజీ సైనికులచే నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలబడిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, మాజీ సైనికులు, పిల్లలు తదితరులు, పాల్గొన్నారు.